రెండు-దశల ప్రామాణీకరణ
మీరు iOS 13.4, iPadOS 13.4, macOS 10.15.4 లేదా తరువాతి వెర్షన్ డివైజ్‌లలో మీ Apple ఖాతాను సృష్టించినట్లయితే, మీ ఖాతా ఆటోమేటిక్‌గా రెండు-దశల ప్రామాణీకరణను ఉపయోగిస్తుంది.
Apple ఖాతా కోసం రెండు-దశల ప్రామాణీకరణ iOS 9, iPadOS 13, OS X 10.11 లేదా ఆ తర్వాతి వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. మీరు ఇంతకుముందు రెండు-దశల ప్రామాణీకరణ లేకుండా Apple ఖాతాను సృష్టించినట్లయితే, రెండు-దశల ప్రామాణీకరణను ఆన్ చేయడానికి ఈ దశలను అనుసరించండి:
సెట్టింగ్స్
> [మీ పేరు] > సైన్-ఇన్- & భద్రతకు వెళ్లండి.
‘రెండు-దశల ప్రామాణీకరణను ఆన్ చేయండి’ ట్యాప్ చేసి, ఆపై స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించండి.
రెండు దశల ప్రామాణీకరణ ఇతరులు మీ Apple ఖాతాను (వారికి మీ Apple ఖాతా పాస్‌వర్డ్ తెలిసినప్పటికీ), iOS, iPadOS, macOSలోని కొన్ని ఫీచర్లను యాక్సెస్ చేయకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. రెండు దశల ప్రామాణీకరణ ఆన్‌లో ఉన్నప్పుడు, విశ్వసనీయ డివైజ్‌ను ఉపయోగించి మీరు మాత్రమే మీ ఖాతాను యాక్సెస్ చేయవచ్చు. మీరు కొత్త డివైజ్‌కు మొదటిసారిగా సైన్ ఇన్ చేసినప్పుడు, మీ Apple ఖాతా పాస్‌వర్డ్ మరియు మీ ఫోన్ నంబర్‌కు ఆటోమేటిక్‌గా పంపబడే లేదా మీ విశ్వసనీయ డివైజ్‌లలో కనిపించే ఆరు అంకెల ధృవీకరణ కోడ్ మీరు రెండు రకాల సమాచారం అందించాలి. కోడ్‌ను నమోదు చేయడం ద్వారా, మీరు కొత్త డివైజ్‌ను విశ్వసిస్తున్ననట్లు ధృవీకరిస్తారు.