ఫ్యామిలీ షేరింగ్ సభ్యుల రకాలు
ఫ్యామిలీ షేరింగ్ గ్రూప్‌లోని సభ్యులు వారి వయస్సును బట్టి వేర్వేరు పాత్రలను కలిగి ఉండవచ్చు.
నోట్: ఒక వ్యక్తిని వయోజనులుగా లేదా పిల్లలుగా పరిగణించే వయస్సు దేశం లేదా ప్రాంతాన్ని బట్టి మారుతుంది.
ఆర్గనైజర్: ఫ్యామిలీ షేరింగ్ గ్రూప్ సెటప్ చేసే వయోజనులు. ఆర్గనైజర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించవచ్చు, కుటుంబ సభ్యులను తొలగించవచ్చు, గ్రూప్‌ను తొలగించవచ్చు.
వయోజనులు: 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఫ్యామిలీ షేరింగ్ గ్రూప్‌లోని సభ్యులు.
పేరెంట్/సంరక్షకులు: గ్రూప్‌లోని పిల్లల కోసం పేరెంటల్ కంట్రోల్‌లను నిర్వహించడంలో సహాయపడే ఫ్యామిలీ షేరింగ్ గ్రూప్‌లోని వయోజన సభ్యులు. ఆర్గనైజర్, ఫ్యామిలీ షేరింగ్ గ్రూప్‌లో వయోజన వ్యక్తిని జోడించినప్పుడు, గ్రూప్‌లో పిల్లలు లేదా టీనేజర్ సభ్యులు ఉన్నట్లయితే వారు వారిని పేరెంట్ లేదా సంరక్షకులుగా గుర్తించవచ్చు.
పిల్లలు లేదా టీనేజర్లు: 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఫ్యామిలీ షేరింగ్ గ్రూప్‌లో సభ్యులు. సొంతంగా ఖాతాను సృష్టించుకోలేని చిన్న పిల్లల కోసం ఆర్గనైజర్, పేరెంట్ లేదా సంరక్షకులు Apple ఖాతాను సృష్టించవచ్చు. మీ పిల్లల కోసం Apple ఖాతాను సృష్టించడం అనే Apple మద్దతు ఆర్టికల్ చూడండి.